ట్యాపింగ్ దందా లో ఒకరిద్దరు సర్వీస్ ఫ్రొవైడర్ల ప్రమేయం కూడా ఉండొచ్చని సిట్ అనుమానిస్తుంది. ప్రస్తుతం టెలికం విభాగంలో సర్వీస్ ఫ్రొవైడర్లుగా ఎయిర్ టెల్ ,బి యస్ ఎన్ ఎల్ జియో లతో పాటు వోడా ఐడియా లు న్నాయి . హైదారాబాద్ కేంద్రంగా. ఆయా సెల్ కంపెనీల్లో కీలక స్థానాల్లో ఉన్న వారిని టాస్క్ ఫోర్స్ ,యస్ వో టి ,యస్ ఐ బి లో పనిచేసే అధికారులు సన్నిహత సంబంధాలున్నాయి. ఆయా కేసులో దర్యాప్తు అవసరాల కోసం అనుమానితుల కాల్ డేటా తో పాటు వారి టవర్ సెల్ లొకేషన్ లాంటి వివరాలను ఆయా సెల్ సంస్థలు పోలీసు శాఖకు అందజేస్థాయి.
ఈ వివరాలు ఇచ్చే విషయంలో పక్క మార్గదర్శకాలే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇదో దందా గా మారిపోయింది. అంగడి సరుకుగా మార్చేశారు.కమిషనర్ ఎస్పీ లకన్న ముందే రోహిత్ రావు టీం కుడేటాచేరేది. అధికారికంగా వచ్చే రిక్వెస్ట్ లకన్నా ఈ టీం కె వేగంగా సేవలు అందించే వ్యవస్థ ఆయా సర్వీస్ ఫ్రొవైడ్ సంస్థల్లో బలంగా ఉంది. ఏ ఏ సంస్థల్లో ఎవరెవరు చేతులు కలిపిందో కూడా సిట్ అరా తీస్తుంది. కానీ. సర్విస్ ఫ్రొవైడర్ల లలో లీకు వీరులు టాస్క్ ఫోర్స్, యస్ వో టి ,సీసీ యస్ విభాగాల్లో పనిచేసే కింది స్థాయి అధికారులతో ఇచ్చిపుచ్చుకునే దోస్తీ ఉంది.
కానీ సర్వీస్ ఫ్రొవైడర్ల నుంచి డేటా తీసుకోవడం అంట సులువైన పనేమీ కాదు అందులోనూ అదేమీ తేరగా దొరకదు. సర్వీస్ ఫ్రొవైడర్ లనుంచి డేటా తీసుకోవడానికి ఆయా జిల్లాల ఎస్పీ లు కమిషనర్ డీసీపీ లకు మాత్రమే యాక్సెస్ ఉంది. వారి ఐడీ లనుంచి రిక్వెస్ట్ వస్తేనే టవర్ లొకేషన్ కాల్ డేటా ఇవ్వాలి. కానీ యాక్సెస్ లేని అనేక మంది అధికారులకు సర్వీస్ ఫ్రొవైడర్లు యథేచ్ఛగా డేటా ఇచ్చేస్తున్నారు.
హైదరాబాద్ లో ఇలా సర్వీస్ ఫ్రొవైడర్ల నుంచు దొంగచాటుగా సేవలు పొందుతున్న వారిలో అరడజన్ మంది ఏసీపీ లు 20 పైగా సీఐ లున్నారు.వీరంతా ఆయా విభాగాల్లో పనిచేస్తూ విధి నిర్వహణలో భాగంగానే సర్వీస్ ఫ్రొవైడర్ సంస్థల్లో పనిచేసే అధికారులను మచ్చిక చేసుకొని వ్యక్తిగత అవసరాల సైతం వీరిని వాడేస్తున్నారు
ఇందులో భాగంగానే రాజకీయ నాయకులవే కాకుండా ప్రైవేట్ వ్యక్తుల పర్సనల్ ప్రొఫైల్స్ కూడా రాధా కిషన్ రావు తయారు చేసి.. ఫోన్లు ట్యాప్ చేశారని తేలింది. ట్యాపింగ్ కేసులో నిందితులు చెప్తున్న వివరాలు దర్యాప్తు అధికారులే విస్తుబోతున్నారు.