పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల పరిహారం చెల్లించాలి. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలని బిఆర్ యస్ లోకసభ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బాజి రెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. శనివారం నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద జరిగిన రైతు దీక్ష లో పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ . రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని .రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రైతుబంధు రూ.15 వేలు, వడ్లకు మక్కలకు రూ.500 బోనస్, రైతు కూలీలకు రూ.12 వేలు, కౌలు రైతుల రూ.15 వేలు ఇస్తామని చెప్పిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ కూడా మాట తప్పింది.
కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. కేసీఆర్ రైతులు దగ్గరికి వస్తున్నాడు కాబట్టి బీజేపీకి రైతులు ఇప్పుడు గుర్తొస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను ఆదుకోవాలి. వడ్లు కొనబోమని చెప్పింది బీజేపీ కాదా? కాంగ్రెస్‌కు అధికారంలోకి వచ్చాక కళ్లు నెత్తుకెక్కాయన్నారు.