ద్విచక్ర వాహనం ఢీ కొని వృద్ధురాలు మృతి చెందిన ఘటన నంది మండలంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. నందిపేట్ ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం..
నందిపేట్ మండలంలోని వన్నెల్(కే) గ్రామానికి చెందిన పైడాకుల గంగుబాయ్(75).గ్రామంలోని రామాలయం వద్ద రాత్రి బోజనానికి వెళ్లి ఇంటికి వెళ్ళే క్రమంలో సిద్ధపూర్ నుంచి నందిపేట్ వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రురాలిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు.
ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదున్నరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నందిపేట్ ఎస్ఐ హరిబాబు పేర్కొన్నారు.