అనుమానాస్పదంగా యువకుడు నీటి కుంటలో మృతి చెందిన ఘటన ఆలూరు మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. మాక్లూర్ ఏఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం..
మండలంలోని గుత్ప గ్రామానికి చెందిన నాగోళ్ళ శ్రీకాంత్(34).భార్య,కూతురు ఉన్నారు.
తరుచూ భార్య తో గొడవలు జరిగేవని తెలిపారు.ఈ మేరకు భార్య గత ఐదు నెలల క్రితం డెలివరీ నిమిత్తం మాక్లూర్ లోని తల్లిగారింటికి వెళ్లిందని తెలిపారు.
ఈ మేరకు తరుచూ కలహాల కారణంగా భార్య తల్లిగారింటి వద్దనే ఉంటుంది.ఈ మేరకు ఈ నెల 18న మాక్లూర్ వెళ్లి భార్యను తన వెంట రావాలని కోరగా అందుకు ఆమె పండగ తరువాత వస్తానని చెప్పారు.
సదరు శ్రీకాంత్ మాక్లూర్ నుంచి వెళ్లి మార్గ మద్యంతో గుత్ప గ్రామ శివారులోని నీటి కుంటలో శవమై మంగళవారం ఉదయం కనిపించాడు.
స్థానికులు గమనించి పోలీస్ లకు సమాచారం అందించారు.సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ గంగాధర్ పేర్కొన్నారు.
