దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించిన అటవీ శాఖ అధికారులు
అటవీ భూముల్లో అధికారులకు గిరిజనులకు మధ్య తీవ్ర ఉధృక్తత జరిగింది. ఆక్రమించిన అటవీ భూముల్లో వేసిన పంటలను తొలగించేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులపై గిరిజనులు ఎదురు తిరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ఘటన సిరికొండ మండలం రావుట్ల అటవీ భూముల్లో జరిగింది.అటవీ శాఖ అధికారులతో గిరిజనులు తీవ్ర వాగ్వాదం చేయడంతో పరిస్థితి దాడికి దిగి పరిస్థితి వరకు దిగజారింది.
సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో ఫారెస్ట్ భూమిలో గిరిజనులు అక్రమంగా వరి మరియు పత్తి సాగుచేసిన పంటను ఫారెస్ట్ అధికారులు పోలీసుల బందోబస్తుతో జెసిపి సహాయంతో ధ్వంసం చేస్తుండగా కొంతమంది గిరిజనులు ఫారెస్ట్ అధికారులను జెసిపిని అడ్డుకొని దాడికి దిగడంతో పోలీసులు దాడికి దిగిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ నికిత , ఓ ఎఫ్ డి ఓ బావనిశంకర్, ఏసిపి రాజా వెంకట్ రెడ్డి, డిచ్పల్లి సిఐ మల్లేష్, ధర్పల్లి సిఐ బిక్షపతి, ఎఫ్ ఆర్ వో ఎమ్ వి నాయక్, సిరికొండ ఎస్ఐ ఎల్ రామ్ సిబ్బంది పాల్గొన్నారు.