ఆదివారం అందులోనూ అర్ద రాత్రి వేళా రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడిన దాదాపు అరగంట హడావుడి చేశారు ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .
పోలీసులకుఎలాంటి పిర్యాదు అందక పోవడంతో ఈ నిర్వాహకం ఇంటిదొంగల పనే అయి వుంటుందని భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ లో ఈ మద్యే పెద్దఎత్తున అధికారుల బదిలీలు జరిగాయి.
ఇందులో భాగంగా నిజామాబాద్ అర్బన్ లోనూ ఇద్దరు కొత్త అధికారులు వచ్చారు. ఈ నేపథ్యంలోకవిత కాంప్లెక్స్ లో ఉండే ప్రధాన కార్యాలయం లోకి ఆదివారం అర్ద రాత్రి చొరబడ్డారు.
వచ్చిన వారెవరో కాదు అందులో పనిచేసే వారని తర్వాత తెల్సింది. ఇద్దరు అధికారులు రికార్డ్ అసిస్టెంట్ లు రికార్డ్ గదిలో చాలాసేపు సోదాలు చేసి నట్లు తెల్సింది.
కార్యాలయం పనిచేసే రోజుల్లోనే నిర్ణిత సమయానికి విధులకు రాని వారు అదికూడా సెలవు దినమైన ఆదివారం అందులోనూ అర్ద రాత్రి వచ్చారంటే ఖచ్చితంగా అధికారిక పని మాత్రం అయి వుండదు.
ఏదో కీలక మైన డ్యాకుమెంట్ కోసం వెతికి వుంటారనిసిబ్బంది గుస గుసలాడుతున్నారు