నిజామాబాద్ జిల్లా జైలులో గుండెపోటుతో ఓ అండర్ ట్రయల్ ఖైది మృతి చెందాడు కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ గుట్ట ఎర్రమన్ను కుచ్చ ప్రాంతం కు చెందిన తిరుమలయ్య (28) చోరీ కేసులో . గత ఏడు నెలలుగా నిజామాబాద్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. సోమవారం తెల్లవారుజామున అతనికి గుండెపోటు రాగా జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
