నగరంలో రాత్రి పూట దొంగతనాలు మాములే కానీ ఈసారి దొంగలు పోలీస్ కమిషనర్ ఉండే ఇంటికి ఎదురుగా ఉండే షాప్ లోనే దొంగతనానికి పాల్పడ్డారు.షట్టర్ తాళం పగగొట్టి షాపు లోకి చొరబడే దొంగలు ఈసారి ఆ షాప్ గోడ కు రంద్రం చేసి చోరీ కి పాల్పడ్డారు. తమ బాస్ ఇంటిముందే చోరీ ఘటన తో నగర పోలీసులు బిత్తర పోయేలా చేసింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తిలక్ గార్డెన్ కాంప్లెక్స్ ఉండే వెంకటేశ్వర్ మొబైల్ షాప్ లోకి సోమవారం అర్ద రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తిలక్ గార్డెన్ వైపు ఉండే గోడ కు గడ్డపార తో రంద్రం చేశారు. లోపలికి చొరబడ్డారు. మొబైల్ షాప్ లో ఉండే అత్యంత ఖరీదైన సెల్ ఫోన్లు ను ఎత్తుకెళ్లారు.ఖరీదైన ఫోన్ లను తక్కువ మార్జిన్ ఫై విక్రయించడం ఈ షాప్ కు ప్రత్యేకత ఉంది.
సెల్ ఫోన్ షాప్ యజమాని పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం ను రంగంలోకి దించారు. వేలి ముద్రలు సేకరించారు. అయితే దొంగలు ఎత్తుకెళ్లిన సెల్ ఫోన్ ల విలువ పది లక్షల రూపాయలుంటుందని బాధితుడు చెప్తున్నారు.పదిహేను రోజుల క్రితమే ఇదే షాప్ లో షెట్టర్ వంచేసి చోరీ కి యత్నించారు.