కందకుర్తి గోదావరిలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది.వివరాల్లోకి వెళ్లితే.. కందకుర్తి గోదావరి పుష్కర ఘాట్ వద్ద సుమారు 25 నుంచి 30 సంవత్సరాల యువకుడి మృతదేహం లభ్యమైంది.
అక్కడ ఉన్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
మృతుని వివరాలు తెలిసిన వారు 8712659874 రెంజల్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
