హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మహిళ మీద అభియోగాలను రుజువుకావడంతో జీవిత ఖైదు విధిస్తు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సునీత కుంచాల తీర్పు ఇచ్చారు.
నిజామాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన గంగా మల్లు అదే గ్రామంలో ఆమె ఇంటికి ఎదురుగా ఉండే రిటైర్ కానిస్టేబుల్ రాం ప్రసాద్‌ల మధ్య ఏళ్ల తరబడిగా వైరం ఉంది.
తమ ఇంటి ముందు వాహనాల పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య అనేక ఘర్షణలు జరిగేవి.
ఇదే వారిద్దరి మధ్య వైరం పెంచింది. 2022 ఫిబ్రవరి 25న రాత్రి నిజామాబాద్ నుంచి ఖానాపూర్ వస్తున్నా రాంప్రసాద్‌ను అదే గ్రామ శివారులో మాటు వేసి వెనుక నుంచి బండ రాయి కొట్టి హత్య చేసింది.
రూరల్ పోలీసులు కేసు నవెూదు చేసి గంగామల్లును జైలుకు పంపారు. జిల్లా కోర్టులో కేసు విచారణ జరిగింది. నిందితురాలు మీద పోలీసులు వెూపిన అభియోగాలు రుజువు కావడంతో గంగా మల్లుకు యావజ్జివ కారాగార శిక్ష విధిస్తు తీర్పు చెప్పారు.
