ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నాలుగు సంక్షేమ పథకాల అమలు కు లబ్ది దారుల ను గుర్తించడమే క్లిష్టంగా మారనుంది. ఈ నెలాఖరులోగా ఆ పథకాలలను అమల్లోకి తెస్తామని ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించింది.
అయితే ఆయా పథకాల కు అర్హులైన వారిని గుర్తించడానికి ప్రభుత్వం పక్కాగా మార్గదర్శకాలు జారీచేసింది.అలాగే కలెక్టర్ లకు సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈ పథకాలు అమల్లోకి తెస్తే సానుకూల పలితాలు సాదించ వచ్చనేది అధికార పార్టీ ఎత్తుగడ గా భావించారు.
కానీ కీలకమైన ఈ పథకాలకు అర్హులను ఖరారు చేయడమే ఇప్పుడు యంత్రాంగానికి కత్తిమీద సాముగా మారింది. మొదట అర్హుల కోసం అధికారులు సర్వే చేశారు. వారి నుంచి దరఖాస్తులు తీసుకున్నారు.
ఆ మేరకు అర్హుల జాబితా ను సిద్ధం చేశారు. గ్రామ సభల్లో ఆ జాబితా ను ప్రకటించి ఆతరవాత అభ్యంతరాలు నమోదు చేయాలి. ఈ మేరకు సర్వే పక్రియ ను పూర్తీ చేశారు. మంగళవారం నుంచి మొదలైన న గ్రామ సభలు నాలుగు రోజులు జరుగనున్నాయి.
కేవలం అర్హులను గుర్తించడానికే జరగాల్సిన గ్రామ సభలు దారి తప్పుతున్నాయి. ఆయా సమస్యలప్రస్తావన తో రసాభాస అవుతున్నాయి. ఆఫీస్ లో కుర్చీలో కూర్చొని సిద్ధం చేసిన అర్హుల జాబితా పేర్లు లేవంటూ స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. వారిని సముదాయించడానికి కొత్తగా దరఖాస్తులు ఇవ్వాలని చెప్తున్నారు అంతేఇక దరఖాస్తులు పోటెత్తుతున్నాయి.
గ్రామ సభకు వస్తున్నవారు కొత్త దరఖాస్తులు ఇవ్వడానికే బారులు తీరుతున్నారు. అర్హుల జాబితా కు తుది రూపం ఇవ్వడానికి వచ్చిన అధికారులు కొత్త దరఖాస్తులు తీసుకోవడానికి తీరిక లేకుండా ఉంది. ఒక్కో సభ లో వందలాది దరఖాస్తులు వస్తున్నాయి.
నిజామాబాద్ నగరంలో ఒక్కోరోజు రెండు పూటల అరడజన్ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల్లోనే 60 గ్రామ సభలు జరపడానికి కార్యాచరణ సిద్ధం చేసారు. ఇంకా వేలాదిదరఖాస్తులే వస్తుండడంతో వీటిన్నింటిని ఏమి చెయ్యాలనేది అధికారులకు అంతు చిక్కడం లేదు. ఎందుకంటే ఈపాటికే ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డు లు ఎవరికి ఇవ్వాలి అర్హులెవ్వరనేది ఖరారు చేశారు.
కానీ కొత్తగా వస్తున్న దరఖాస్తులను సంగతి ఏమిటనేది ప్రశ్నార్థకం అయింది.ఎందుకంటే గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇండ్లకు రేషన్ కార్డు ల కోసం వేలాది గా దరఖాస్తులు వచ్చాయి. మళ్ళీ వీటిని స్క్రూటినీ చేసి అర్హులనుఖరారు చేయడం ఇప్పట్లో సాధ్యం కాదు.
