నిషేధిత మత్తుమందు అయిన ఆల్ఫాజోలంను ఆర్మూర్ పట్టణంలో నార్కోటిక్ విభాగం అధికారులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. సుమారు 500 గ్రాముల ఆల్ఫాజోలంను పట్టుకోవడంతో పాటు, ఈ అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఆర్మూర్‌లో కొంతమంది వ్యక్తులు నిషేధిత మత్తుపదార్థాలను అక్రమంగా విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు నార్కోటిక్ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో అరకిలో (500 గ్రాములు) ఆల్ఫాజోలం గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ప్రణీత్ గౌడ్, అశోక్ గౌడ్ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు ఆర్మూర్ ఎస్ఎహ్ఓ సత్యనారాయణ తెలిపారు.
