నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రైలు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తూ కాలు జారి ఒక గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు.
రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఒక గుర్తు తెలియని అందాజ 40-45 సంIIల వయసు గల పురుషుడు నిజామాబాద్ రైల్వే స్టేషన్ మూడవ నంబర్ ప్లాట్ ఫామ్ పై రైలును ఎక్కుచుండగా ప్రమాదవశాత్తూ కాలు జారి ప్లాట్ఫాం మద్య పడిపోయినట్లు తెలిపారు.
అదే సమయంలో రైలు కదిలినందున రైలునకు ప్లాట్ఫాం మద్యలో నలిగిపోయి కలిగిన గాయలవల్ల అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
మృతుని గుర్తించుటకు ఎటువంటి ఆధారాలు లబించలేదు. మృతుని కుడి చేయికి మద్య వేలు తెగి యున్నది. మృతుని గురించి వివరాలు తెలిసినచో 8712568440, సమాచారం ఇవ్వాలని తెలిపారు.
