అది ప్రత్యర్థుల కంచుకోట.. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రత్యర్థి పార్టీ నేత.. వెనక నుంచి మాజీ ఎమ్మెల్యేల విమర్శల దాడి.. ఇన్ని ప్రతికూలతల మధ్య ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్-ఛార్జ్ వినయ్ రెడ్డి రచించిన వ్యూహం అద్భుత ఫలితాలనిచ్చింది.
జిల్లాలో మూడు దఫాలుగా సాగిన పంచాయతీ సమరం అధికార కాంగ్రెస్ పార్టీలో భిన్నమైన చర్చకు తెరలేపింది. తొలి రెండు విడతల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఊపుమీద కనిపించిన హస్తం పార్టీకి.. మూడో విడత ఫలితాలు మిశ్రమ అనుభూతిని మిగిల్చాయి.
ఆర్మూర్ డివిజన్‌లో పార్టీ సాధించిన ఫలితాలు అటు విస్మయాన్ని, ఇటు అంతర్మథనాన్ని కలిగిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు పార్టీ క్యాడర్లో నూతనోత్తేజాన్ని కలిగించాయి.
కానీ ఆర్మూర్ డివిజన్లో ఫలితాలు భిన్నంగా రావడం పార్టీ వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఆర్మూర్ నియోజక వర్గం ఫలితాలు ఆ మాత్రమైన పార్టీ పరువును కాపాడినట్లయింది. బాల్కొండ సెగ్మెంట్లో సానుకూల ఫలితాలు వస్తాయని అక్కడి నేతలు బీరాలు పలికినప్పటికీ ఫలితాలు చూసి తెల్లమొఖాలు వేశారు.
ఆర్మూర్ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బిజెపికి చెందిన రాకేష్ రెడ్డి ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నిక ల్లో ఆ పార్టీ ప్రాబల్యం అంతాగా కనిపించకపోవడం కాంగ్రెస్ నేతలు సంబరపడుతున్నారు.
వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ అ సెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమైంది.
నిజానికి బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి పంచాయతీ ఎన్నికలకు ముందు నియో జకవర్గంలో క్రియాశీలకమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జి వినయెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన ఆరోపణలు చే శారు. జనతా గ్యారెజ్ పేరుతో హడావు డి చేశారు.
అయినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ కోలుకోలేని చావుదెబ్బతింది. ప్రతి కూల పరిస్థితులను అధిగమించి వినయ్ డ్డి పంచాయతీ ఎన్నిక ల్లో వ్యూహాత్మకంగా పావులు కదిపి ఫలితాలు సాధించారు. 86గ్రామ పంచాయతీ లకు ఎన్నికలు జరిగితే 60 స్థానాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులే విజయం సాధించారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే గా బిజెపికి చెందిన రాకేష్ రెడ్డి ఉన్నపటికీ ఆ పార్టీ 12 స్థానాలకే పరిమితమయ్యారు. బిఆర్ఎస్ ప్ర భుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సా ధించామని ఆపార్టీ నేతలు ఊదరకొట్టినప్పటికీ పంచా యతీ ఎన్నికల్లో 7 స్థానాల్లోనే బిఆర్ఎస్ బలపరిచిన అభ్య ర్ధులే గెలిచారు.
పొ రుగునే ఉన్న బాల్కొం డ సెగ్మెంట్లో బిఆర్ఎస్ పార్టీ మరోసారి కంచుకోటను కాపాడుకుంది. ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థు లు మెజార్టీ స్థానాలు గెలిచినప్పటికీ బాల్కొండలో కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్ల పడ డంపై ఆపార్టీ అ గ్రనేతలకు ఏ మాత్రం మింగుడుప డడం లేదు. ఆర్మూర్ వినయ్ రెడ్డి ఒంటిచేతుతోనే పంచాయతీ ఎ న్నికల్లో పార్టీ అభ్యర్థులను విజయతీరాలకు చేర్చారు.
అనేక వివా దాలు ఆరోపణలతో ప్రతికూల పరిస్థితులు తలెత్తినప్పటికీ పంచా యతీ ఎన్నికలు ఫలితాల్లో వీసుమెత్తం ప్రభావం కనిపించలేదు.ని యోజకవర్గంలోని కీలక మండలాలైన నందిపేట్, మా క్లూర్ లోకాంగ్రెస్ పార్టీ తి రుగులేని ఆధిపత్య న్ని ప్రదర్శించింది.
అ సెంబ్లీ ఎన్ని కల నాటికి నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, పంచాయతీ ఎన్నిక ల నాటికి సమరోత్సాహంతో పనిచేశాయి. పార్టీ బలప రిచిన అభ్య ర్థులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. గ్రామీణ ఓటర్లు ఈ సారీ పూర్తిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు ఫలితా లు స్పష్టం చేస్తున్నాయి.
గతంలో పటిష్టమైన ఓటు బ్యాంకు ఉన్న గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోవడం గమ నార్హం. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత కాంగేస్ పార్టీ అంచ నాలకు మించి పుంజుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఆర్మూర్ నియోజకవర్గం లో మొత్తం సర్పంచ్ స్థానాలు 86 ఉండగా కేవలం కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలు కైవసం చేసుకుంది. అటు బీజేపీ 12 స్థానాలు, బిఆర్ఎస్ 7, స్వతంత్రులు 7 స్థానాలు గెలుచుకున్నారు. మాక్లూరు మండలం మొత్తం సర్పంచ్ లు 26 ఉండగా కాంగ్రెస్ : 20 స్థానాలు బిఆర్ఎస్ 1, బీజేపీకి 5 స్థానాలు దక్కాయి.
ఆర్మూర్ మండలంలో మొత్తం సర్పంచ్ స్థానాలు 14 ఉంటే, కాంగ్రెస్ 8,బీజేపీ 2, బిఆర్ఎస్ 2స్వతంత్రులు 2 స్థానాల్లో విజయం సాధించారు. అదే విధంగా నందిపేట్ మండలంలో మొత్తం సర్పంచ్ స్థానాలు 22 కాంగ్రెస్ 18, బిజెపి 2, బిఆర్ఎస్ 1, స్వతంత్రులు 1 దక్కాయి.
డొంకేశ్వర్ మండలం లో మొత్తం సర్పంచ్ స్థానాలు 13 ఉండగా కాంగ్రెస్ 7, బిఆర్ఎస్ 2,బిజెపి 2,స్వతంత్రలు 2 స్థానాల్లో విజయం సాధించారు.అలాగే ఆలూరు మండలంలో మొత్తం సర్పంచ్ స్థానాలు 11ఉంటే కాంగ్రెస్ 7, బిజెపి 2, బిఆర్ఎస్ 1, స్వతంత్రులు 1 స్థానం గెలుచుకున్నారు.
