రాష్ట్రస్థాయి పోటీలలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు బాస్కెట్బాల్ బాలబాలికల విభాగంలో కేటాయించడం జరిగిందని, బాలుర పోటీలు పాత కలెక్టరు మైదానంలో, బాలికల మ్యాచులు నిర్మల హృదయ ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు
ఈ టోర్నమెంట్లో తెలంగాణ లోని 33 జిల్లాల బాల బాలికలు పాల్గొననున్నట్లు వారికి తగిన విధంగా భోజనం, వసతి సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రీడ ప్రాతిపాదిక సంస్థ పరిశీలకులు విశాల్, కబడ్డీ కోచ్ ప్రశాంత్ సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు మల్లేష్ గౌడ్ వెంకటేశ్వర్లు బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నరేష్, ఫిజికల్ డైరెక్టర్ ప్రమీల లు పాల్గొన్నారు.
