రాజ్యసభ ఎంపీ గా కేఆర్ సురేష్ రెడ్డి పదవి కాలం పూర్తీ కానుంది. కాంగ్రెస్ పార్టీ లో దిగ్గజ నేతగా ఉన్న ఆయన అనూహ్యంగా బిఆర్ యస్ లో చేరారు.
దీనితో అప్పుడే ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఆయన ఎంపికయ్యారు ఆరేళ్ళ పాటు పదవి కొనసాగారు గతంలో మాజీ పీసీసీ చీఫ్ డీఎస్ సైతం కాంగ్రెస్ వీడి బిఆర్ యస్ లో చేరడంతో ఎంపీ పదవి దక్కింది జిల్లాకు రాజ్యసభ పదవి దక్కడం ఇదే రెండో సారి.
సురేష్ రెడ్డి పదవి కాలం పూర్తీ కావడంతో ఖాళీ అయ్యే స్థానం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిరవహించబోతుంది ఈసారి జిల్లాకు ఈ పదవి దాక్కుంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది ఈసారి కాంగ్రెస్ పార్టీ ఈ పదవి దక్కించుకో బోతుంది ఈ నేపథ్యంలో జిల్లా నేతలెవరికైనా ఎంపీ చాన్స్ దక్కుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది
