డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి
లోకసభ ఎన్నికల్లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి భారీగా డబ్బులు పంచాడని ఎంపీ అర్వింద్ చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఆ ఆరోపణలపై చర్చకు తాము సిద్ధమని అరవింద్ సిద్దమా అని డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి సవాలు చేసారు ఆయన .
గురువారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి లోకసభ ఎన్నికల ప్రచారంలో రూ 200 పంచారని అర్వింద్ ఆరోపణలను అహంకరపురితమైన మాటలన్నారు .ఐకేపీ, ఆర్పీ లా ద్వారా నియోజక వర్గంలో ప్రతి మహిళకు రూ.300 పంచింది బిజేపి పార్టీ కదా?అని ప్రశ్నించారు.
బిజెపి పంచిన డబ్బు పైన అన్ని ఆధారాలతో ఎలెక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడానికి సిద్ధం గా ఉన్నాము అని ఆయన వ్యాఖ్యానించారు. ఏవరు మతం పేరుతో ఎన్నికల ప్రచారంలో ఓట్లు దక్కించుకునేందుకు ప్రయత్నం చేసింది అని ఆయన ద్వజమెత్తారు.5సంవత్సరాల సుదీర్ఘ కాలం ఎంపీ అరవింద్ నిజామాబాద్ ప్రజలకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
ఎంపీ అరవింద్ నిజామాబాద్ ప్రజలకు చేసిన అభివృద్ధి, మతం పేరు పైన , మరియు డబ్బు పైన చేసిన ఆరోపణలకు అరవింద్ కూ చర్చకు సిద్ధమని ,నువ్వు చర్చ ఎక్కడ ఏర్పాటు చేస్తావో చెప్పు అని ఆయన సవాల్ చేశారు. నువ్వు అవినీతి వ్యక్తి కి పుట్టిన వక్తివి అని విమర్శించాడు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందని,గదుగు గంగాధర్,కేశ వేణు, వేణు రాజ్, నరాల రత్నాకర్,సంతిష్, తదితరులు పాల్గొన్నారు.