పేర్లు మార్చడం కాదు.. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడంపై దృష్టి పెట్టండి” అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు.
జిల్లా పేరు మార్పు అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోమవారం జిల్లా కేంద్రం లోని కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ పనితీరును ఎండగడుతూ పలు ప్రశ్నలు సంధించారు.
జిల్లాకు పారిశ్రామికంగా గానీ, వ్యవసాయ పరంగా గానీ అరవింద్ చేసిన ఒక్క గొప్ప పనిని చూపాలని డిమాండ్ చేశారు.స్థానిక యువతకు ఉపాధి కల్పనలో ఎంపీ పాత్ర ఎంత అని ప్రశ్నించారు.బీజేపీకి కేవలం కుల, మతాల మధ్య చిచ్చు పెట్టడమే తెలుసు.
అభివృద్ధి అజెండా లేదు కాబట్టే, ఇప్పుడు ప్రాంతాల పేర్లు మార్చాలంటూ గందరగోళం సృష్టిస్తున్నారు” అని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గమనిస్తున్నారని, అభివృద్ధిని విస్మరించి చేసే రాజకీయాలను తిప్పికొడతారని హెచ్చరించారు.
అలాగే జిల్లా అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఏం తీసుకోవచ్చావో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ 12 ఏళ్లలో 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఉన్న ఉద్యోగాలు తీసేసారని పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ కు భవిష్యతు లేదని జోస్యం చెప్పారు.
గతంలో 10 ఏళ్లలో జిల్లాను కేంద్రం గా చేసుకొని పీడీఎస్ స్మగ్లింగ్ చేశారని ఆరోపించారు.పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి నేడు ఫామ్ హౌస్ లో ఉన్నారని ఎద్దేవ చేశారు.విద్యా వైద్యం నాశనం చేశారని ద్వజమెత్తారు.
కేటీఆర్ ఐటి మంత్రి గా ఉన్న 10 పైసల పెట్టుబడులు తీసుకురాలేదని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల డెబ్బై కోట్లతో వివిధ కంపెనీలతో చర్చించి పెట్టుబడులకు ఒప్పందాలు చేశామని అన్నారు.జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్నాము అని అన్నారు.అందుకే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
జిల్లాకు డిచ్ పల్లి ప్రాంతంలో ఎయిర్ పోర్టు కు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. జక్రాన్పల్లి ఎయిర్ పోర్టు కు సరైన విమానాలు రాకపోకలు లేకపోవడంతో పెండింగ్ ఉందని స్పష్టం చేశారు.
జిల్లాకు మరొక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం సీఎం తో మాట్లాడి రాజకీయాలకు అతీతంగా మంజూరు చేశామని అన్నారు.నిజామాబాద్ క్రీడా జిల్లా,అనేక మంది క్రీడాకారులను ప్రపంచానికి పరిచయం చేసిందని కొనియాడారు. రూ 10 కోట్లు తో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామని,రాజారాం స్టేడియం కు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఆదివారం రూ 60కోట్ల నిధులతో జిల్లా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు.మున్సిపల్ మేయర్ సీటు కైవసం చేసుకుంటాం..రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుచుకొని మేయర్ సీటు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.అలాగే సీట్ల కోసం ఎవ్వరు పైరవీలు చేసుకోవద్దని తెలిపారు.
పార్టీ ఆద్వర్యంలో సర్వే చేసి ప్రజల మన్నలు పొందిన వారికే సీట్లు ఇస్తామని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అనేక సంక్షేమ పథకాలే పార్టీ గెలుపు వైపు తీసుకుపోతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామక్రిష్ణ, తాహిర్ బిన్ హందాని, నూడ చైర్మన్ కేశవేణు, ఆర్మూర్ ఇంచార్జి వినయ్ రెడ్డి,నరాల రత్నాకర్, జావిద్ అక్రమ్, తదితరులు పాల్గొన్నారు.
