HomeCRIMEకమిషనరేట్ సాక్షిగా …ఖాకీల వీరాంగం ……

కమిషనరేట్ సాక్షిగా …ఖాకీల వీరాంగం ……

పోలీస్ కమిషనరేట్ సాక్షిగా ఖాకీలు వీరాంగం చేసారు.నగరంలోని పోలీసు కమిషనర్ కార్యాలయం వద్ద స్పీడ్ బ్రేకర్ వద్ద TS 16ES 8284 నెంబర్ గల ద్విచక్రవాహనం ను TS 10T/R10140 కారు వెనుక నుంచి తగిలింది. బైక్ మీద ఉన్న కానిస్టేబుల్ శివాలెత్తి పోయాడు. కారు నడుపుతున్న వ్యక్తిని క్షమాపణ అడుగుతున్నా పట్టించుకోకుండా కిందికి దించి ఎడాపెడా తగిలించాడు.‌

కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు కూడా దిగి స్వారీ అని పదే పదే చెప్తున్నా సదురు ఖాకీ వీరాంగం ఆగలేదు. వెంటనే కారు RC ఎక్కడా అంటూ గద్దించడంతో వారు ఆర్ సి ఇచ్చేసారు కమిషనరేట్ కార్యాలయం ఎదుటే వాహన రాకపోకలు సైతం అంతరాయం కలిగింది. గొడవ గమనించిన పైరేడ్ గ్రౌండ్ వద్ద విధులు నిర్వహిస్తున్న గేట్ కీపర్ వచ్చి అగ్గికి ఆజ్యం పోసాడు. వివాదం మరింత ముదిరింది‌.

దారినపోయే వ్యక్తులు ఏంత మంది నచ్చజెప్పిన ఇద్దరు ఖాకీలు ఏ మాత్రం లెక్క చేయలేదు .చివరికి విషయం తెలిసి ఒకటో టౌన్ సీఐ విజయ్ బాబు హుటాహుటిన వచ్చి వీరాంగం చేస్తున్న కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకోని ట్రాఫిక్ క్లియర్ చేయించాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments