నగరంలో వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో నిందితుని రిమాండ్ కు తరలించినట్లు మూడవటం ఎస్ఐ మహేష్ కుమార్ పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..
నిజామాబాదులోని దుబ్బ కు చెందిన విశ్వనాథ్ అను వ్యక్తి తన మిత్రుడు అయిన భాస్కర్ కి గత మూడు నెలల క్రితం 5000 రూపాయలు అప్పుగా ఇచ్చినాడు.
అట్టి డబ్బులు తిరిగి ఇవ్వమని విశ్వనాథ్ పదేపదే భాస్కర్ ని అడగగా భాస్కర్ అట్టి విషయంలో విసుకు చెంది విశ్వనాధ్ ని చంపేద్దామని నిర్ణయించుకొని ఈ నెల 28 న విశ్వనాథ్ శివాజీ చౌక్ వద్ద తన ఆటోలో ఉండగా భాస్కర్ విశ్వనాధ్ ని కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో తలపై మరియు శరీర ఇతర భాగంలో నరికివేసి అక్కడనుండి పారిపోగా,
విశ్వనాథ్ యొక్క భార్య నర్సయించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినారు. తదుపరి టౌన్ సిఐ జి శ్రీనివాస్ పర్యవేక్షణలో టౌన్ 3ఎస్ హెచ్ ఓ యు మహేష్ కుమార్ తన సిబ్బంది కలిసి నిందితుడైన భాస్కర్ ని రెండు గంటల్లోనే పట్టుకొని, కత్తిని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.
