పోలీసులపై దాడి చేసిన నిందుతుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు బోధన్ టౌన్ సీఐ వెంకట్ నారాయణ తెలిపారు. బోధన్ టౌన్ పరిధిలో 100 డయల్ కాల్ రాగా విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అక్కడ ఉన్న బోధన్ గోశాల రోడ్డు కు చెందిన షేక్ అబ్దుల్ అనే వ్యక్తి విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లపై దాడి చేశాడు. దాడికి పాల్పడిన షేక్ అబ్దుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అనంతరం శుక్రవారం బోధన్ కోర్టు లో హాజరు పరచగా అసిస్టెన్స్ సెషన్ జడ్జి, నిందితుడైన షేక్ అబ్దుల్ కు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.
ఈ కేసు దర్యాప్తులో పబ్లిక్ పాసిక్యూటర్ సమ్మయ్య, కోర్టు కానిస్టేబుళ్లు శంకర్,గణేష్,సృజన్ లు పాల్గొన్నారు.
