ముగ్గురు చిన్నారులు అదృశ్యమైన గంట వ్యవధిలోనే పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హస్మి కాలానికి చెందిన మహమ్మద్ బిలాల్ (5). ఆయేషా ఫాతిమా (6). మొహమ్మద్ అలీ (7).
ఈ ముగ్గురు పిల్లలు కలిసి కాలనీలోని కిరణ దుకాణం వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళారు.
ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఐదవ టౌన్ లో ఫిర్యాధు చేయగా కేసు నమోదు చేసి గాలించగా పోలీసులు గంట వ్యవధిలోనే ముగ్గురు చిన్నారులను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
