HomeCRIMEఆటో డ్రైవర్లపై కత్తితో దాడి.

ఆటో డ్రైవర్లపై కత్తితో దాడి.

ఆటో డ్రైవర్లపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి నగరంలో చోటు చేసుకుంది.రెండవ టౌన్ ఎస్ఐ యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ పార్క్ వద్ద ఆటో నిలిపే ఆటో డ్రైవర్లు మాధవ్‌ నగర్ కు చెందిన జాదవ్ గణేష్, తన స్నేహితుడు అయినా ఆదిత్య ను తీసుకొని వర్ని చౌరస్తా లో ఉన్న ఓ ఆటోమొబైల్ షాప్ కు వెళ్తారు.

ఈ క్రమంలో గణేష్ యొక్క మరో స్నేహితుడు మాధవ్‌ నగర్ కు చెందిన నవీన్ ఫోన్ చేయగా వర్ని చౌరస్తాలో ఉన్నానని చెప్పినట్లు తెలిపారు. దీంతో నవీన్ వెళ్లి గణేష్ ఆటో ఎక్కి సామాన్లు (ఫ్లెక్సీలు, శివాజీ బొమ్మలు) తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. దీంతో గణేష్ నవీన్ నీ ప్రశ్నించడంతో వివాదానికి దారితీసింది. దీంతో మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన నవీన్, గణేష్‌పై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు.

ఈ దాడిని అడ్డుకోబోయిన ఆదిత్య చేతికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు నవీన్‌పై పోలీసులు హత్యాయయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments