మాక్లూర్ మండలం గాలిబ్‌నగర్ నుంచి కల్లెడకు వెళ్లే అటవీ ప్రాంతంలో ఐదు చిరుతలు రోడ్డుపైకి వచ్చి సంచరించాయి. రాత్రివేళ అటువైపు వెళ్తున్న ప్రయాణికులు చిరుతలను గమనించి అక్కడే వాహనాలను నిలిపివేశారు. కొద్దిసేపు రోడ్డుపైనే సంచరించిన చిరుతలు అనంతరం అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి.
ఈ ప్రాంతంలో చిరుతల సంచారం కనిపించడంతో స్థానికులు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళ గాలిబ్‌నగర్–కల్లెడ అటవీ మార్గంలో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచించారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతల సంచారంపై నిఘా పెట్టాలని కోరుతున్నారు.
