నగరంలోని గౌడ్స్ కాలనీకి చెందిన భక్తులు తిరుమల తిరుపతి శ్రీవారి సేవకు బయలుదేరారు. గౌడ్స్ కాలనీ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటైన ఈ జట్టులో పలువురు మహిళలు పాల్గొన్నారు. ఏడు రోజుల పాటు తిరుమలలో నిర్వహించే శ్రీవారి సేవా కార్యక్రమాల్లో వారు పాల్గొని భక్తులకు సేవలందించనున్నారు.ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
భక్తిశ్రద్ధలతో స్వామివారిని సేవించడంతో పాటు, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని తెలిపారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు నిజామాబాద్ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.నిజామాబాద్ నగర, జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని స్వామివారిని ప్రార్థిస్తామని చెప్పారు.
ప్రజలకు ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు కలగకుండా స్వామివారి కృప ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏడు రోజుల పాటు జరిగే శ్రీవారి సేవలో భక్తిశ్రద్ధలతో పాల్గొని సేవలను విజయవంతంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
గౌడ్స్ కాలనీ నుంచి బృందం సభ్యులు బయలుదేరుతున్న సందర్భంగా కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. స్వామివారి సేవను విజయవంతంగా పూర్తి చేసి క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.
ఈ శ్రీవారి సేవా యాత్రలో వాణి, శ్యామల, జయప్రద, స్వప్న, వనజ, రాజమణి, పావని, సులోచన, స్వప్నరాణి, భవాని, లక్ష్మి, శిరీష, లత తదితరులు పాల్గొన్నారు.
