జెసిబి తో వాగులు నుండి ఆటోను బయటకు లాగిన స్థానికులు- మోర్తాడ్ మండలం ధర్మోరా, పాలెం గ్రామాల మధ్య పెరిగిన వాగునీటి ఉదృతి- వాగు నీటిలో చిక్కుకుపోయిన బాల్కొండకు చెందిన నువ్వుల వ్యాపారి ఆటో
ఇటీవల కురుస్తున్న వర్షాలకు బాల్కొండ నియోజకవర్గంలోని కప్పల వాగు, పెద్ద వాగుల్లో నీటి ప్రవాహం పెరుగుతుంది .
మోర్తాడ్ మండలం ధర్మోరా – పాలెం గ్రామాల మధ్య ఉన్న వాగు నీటిలో బాల్కొండ మండల కేంద్రానికి చెందిన నువ్వుల వ్యాపారి ఆటో చిక్కుకుపోయింది.
పాలెం వైపు నుండి ధర్మోరా వైపుకు వస్తుండగా ప్రయాణికులతో కూడిన టాటా ఏసీ వాహనం చెక్ డ్యామ్ నుండి కిందకు ప్రవహిస్తున్న వాగు నీటిలో చిక్కుకుపోవడంతో ప్రవహిస్తున్న నీటిలో ఆటో ఆగిపోయింది.
దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేయడంతో ధర్మోర గ్రామస్తులు దానిని గమనించి జెసిబి సహాయంతో తాళ్ళను కట్టి వాగు ఒడ్డుకు లాగారు.
దీంతో ప్రాణ ప్రమాదం తప్పినట్టు అయింది. పెరిగిన వాగు నీటి ఉధృతని దృష్టిలో పెట్టుకొని మోర్తాడ్ ఎస్సై ధర్మోర గ్రామాల మధ్య ప్రయాణికుల రాకపోకలను నిలిపివేశారు.
ఇటీవల ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభమైన తర్వాత నీటి ఉధృతి లో అటు చిక్కుకున్న ఘటన ఇదే మొదటిసారి కావడంతో చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.