జిల్లాలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బి. రాజాగౌడ్ నునియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)గా ఎస్జీడీసీ హోదాలో పనిచేస్తున్న బి. రాజాగౌడ్‌ను నిజామాబాద్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.
పరిపాలనా అవసరాల దృష్ట్యా ఐఏఎస్, నాన్ క్యాడర్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల్లో భాగంగా ఈ నియామకం చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాజాగౌడ్ త్వరలో నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
