HomeTelanganaNizamabadప్రశాంత్ రెడ్డి ని నిలదీసిన బాల్కొండ .....సన్నాహక సమావేశంరసాభాసా

ప్రశాంత్ రెడ్డి ని నిలదీసిన బాల్కొండ …..సన్నాహక సమావేశంరసాభాసా

అధికారంలో ఉన్న పదేళ్లుపార్టీ కోసం పనిచేసిన వారికి దగ్గరికి కూడా రానివ్వలేదని బాల్కొండ నేతలు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మీద నిప్పులు చెరిగారు. ఇప్పడు క్యాడర్ సేవలు గుర్తచ్చోయా అంటూ నిలదీశారు.

పార్టీ పదేళ్లు అధికారంలో వుంటే ఎలాంటి పదవులు మాకు ఇవ్వలేదు ఇప్పడు ఇస్తామని మరోసారి అదే హామీ ఇస్తున్నారు మిమ్మలి ఎలా నమ్మాలి అంటూ మండిపడ్డారు. క్యాడర్ దీక్షా దివాస్ ను విజయవంతం చేయడానికి మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ని పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసారు.

జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఇంచార్జ్ గా మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హాజరు అయ్యారు.

మాజీ ఎమ్మెల్యే లు మాజీ ఎమ్మెల్సీ లు వచ్చారు. ముఖ్య అతిథి గా వచ్చిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలో కి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా వచ్చిందని కార్యకర్తలు సమిష్టంగా పనిచేసి వచ్చే లోకల్ బాడి ఎన్నికల్లో విజయం సాదించాలని కష్ట పనిచేసిన వారికే ఈ ఎన్నికల్లో టికెట్ లు వస్తాయని పేర్కొన్నారు దీనిపై బాల్కొండ కు చెందిన ఉద్యమ నేత చిన్న రెడ్డి లేచి ప్రశాంత్ రెడ్డి స్పీచ్ కు అడ్దుకున్నారు.

పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల పనిచేసిన క్యాడర్ ఎవరికి కనిపించలేదని రగిలి పోయారు గతంలోనూ ఇలాగే మాట్లాడారు కానీ ఎలాంటి పదవులు ఇవ్వలేదని తీవ్ర స్వరంతో మాట్లాడారు ఆయన తోడుగా ఆర్మూర్ బాల్కొండ సెగ్మెంట్ ల నేతలు సైతం గొంతు కలిపారు జీవన్ రెడ్డి జోక్యం చేసుకొని సముదాయించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments