న్యాయవాదుల ఆద్వర్యంలో మానవహారం…న్యాయవాది పై జరిగిన దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని,వారిపైన హత్యాచారం యత్నం కేసు నమోదు చేయాలని బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు.
అందుకు రెండవరోజు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాది మహమ్మద్ ఖాసిం పైన జరిగిన దాడికి నిరసనగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీఆర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ….నిజామాబాద్ నగరంలోని ఖిల్లారోడ్ ప్రాతంలో ఉన్న న్యాయ వాది మహమ్మద్ ఖాసీమ్ కార్యాలయ స్థలాన్ని అమ్మివేయాల ని లేదంటే చంపివేస్తామని బెదిరించి, ఆదివారం ఖాసీమ్ కార్యాలయంలో ఉన్న సమయంలో అర్షద్ ఖాన్, ముజఫర్ ఖాన్, ముజాయిద్ ఖాన్ దాడి చేసి తీవ్రంగా గాయపరచడం వారి గుండాగిరి చేయడం పట్ల నిరసన వ్యక్తం చేశారు.
అందుకు వెంటనే వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.పోలీసులు తక్షణమే చర్యలు తీసుకొని నగరంలో శాంతిభద్రతలు కాపాడాలని రాష్ట్రంలో న్యాయవాద ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు.
