HomeTelanganaNizamabadమాజీల్లో కవిత రీఎంట్రీ టెన్షన్ …పార్టీలో పట్టుకోసం పావులు ….

మాజీల్లో కవిత రీఎంట్రీ టెన్షన్ …పార్టీలో పట్టుకోసం పావులు ….

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి యేడాది కాలం తీసుకున్న మాజీ లు ఇప్పుడిప్పుడే కార్యక్షేతంలోకి వస్తున్నారు.

జస్ట్ పెండ్లిలు, పరామర్శలతో ప్రస్థానం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత మరోసారి ఎంట్రీ ఇవ్వడానికి సమాయత్తం అవుతుండడం తో మాజీల్లో గుబులు మొదలైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు నుంచి వచ్చాక కొంత కాలం అజ్ఞాతంలో ఉన్న కవిత మరోసారి రాజకీయాల్లో క్రియాశీలం కావడానికి సిద్ధం అవుతున్నారు మరోసారి జాగృతి వేదిక ను తెరమీదికి తెచ్చారు.

అనూహ్యంగా బిసి నినాదం ఎత్తుకున్నారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ గా ఉన్న ఆమె రాబోయే రోజుల్లో అధికార వ్యవహారాల్లో క్రియాశీలంగా వుండేలా ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా అభివృద్ధి పనులపురోగతి ని సైతం అరా తీస్తున్నారు.

జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టు ల మీద గళమెత్తబోతున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయాక జిల్లా పార్టీ పాలన వ్యవహారాలకు దూరంగా ఉండిపోయారు. రెండో సారి గెలిచిన ఎమ్మెల్యే లు ఎంపి ఎన్నికల్లో తన గెలుపు కోసం శ్రమించలేక పోయారని కవిత ఎమ్మెల్యే మీద రగిలి పోయారు.

ఒకరిద్దరు ఎమ్మెల్యే వ్యతిరేకంగా పనిచేశారని ఆమె అధినేత కు పిర్యాదు కూడా చేశారని ప్రచారం జరిగింది. అందుకే తదుపరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కవిత ను గెలిపించడానికి సర్కస్ ఫీట్లే వేశారు యదేచ్చగా పిరాయింపులకోసం భారీగా నజరానాలు ఎర వేశారు.

ఈలోపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెరమీదికి రావడంతో కవిత రాజకీయంగా ఆత్మ రక్షణ లో పడ్డారు అందుకే ఎమ్మెల్సీ గా గెలిచాక కూడా అంతగా యాక్టివ్ కాలేక పోయారు.నియోజకవర్గాల్లో తలదూర్చడానికి ఆసక్తి చూపలేదు.అసెంబ్లీ ఎన్నికలోనూ బోధన్ అర్బన్ సెగ్మెంట్ లకు ఇంచార్జ్ గా నియామకం అయ్యారు అయినా పరిమితంగా నే పనిచేసారు.

ఆ రెండు సెగ్మెంట్ ల్లోనూ ప్రతికూల ఫలితాలే వచ్చాయి దీనితో ఆమె మరింత సైలెంట్ అయ్యారు దీనికి తోడు అధికారం కోల్పవడంఆ వెంటనే లిక్కర్ కేసులో జైలు కు వెళ్లారు దీనితో ఎంపి ఎన్నికల్లో ఆమె ప్రమేయం లేకుండానే జరిగి పోయాయి. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తో కోలుకోలేని దెబ్బ తిన్న మాజీలు చాల రోజులు అజ్ఞాతంలోనే గడిపారు.

అధికారం కోల్పోయాక నియోజకవర్గాల్లో సమీకరణాలు పూర్తిగా తలకిందులయ్యాయి. కీలక నేతలు క్యాడర్ చేజారి పోయింది. పదేళ్లు ఎమ్మెల్యే లుగా పనిచేసిన సెగ్మెంట్ లకు వెళ్తే పట్టు మని పది మంది వెంట నడవని దుస్థితి మాజీలకు మింగుడు పడలేదు.

అందుకే ఏడాది పాటు నియోజకవర్గాలకు మొఖం చాటేసారు. స్థానికంగా పదవుల్లో ఉన్న నేతలంతా జంప్ అయ్యారు. కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత క్రమంగా పెరుగుతుండడంతో మాజీ ల్లో మళ్ళీ రాజకీయ భవిష్యత్తు మీద ఆశలు చిగురిస్తున్నాయి.

ఏడాది పాటు స్థానికంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను మాజీలు గాలికి వదిలేసారు ఏ ఒక్కరూ గొంతెత్తలేక పోయారు. కానీ లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులను అదిగిమించే కార్యాచరణ తో ముందుకొస్తున్నారు.

కానీ ఈలోపు కవిత సైతం ఎమ్మెల్సీ హోదా లో మరోసారి ఎంట్రీ ఇవ్వడానికి సమాయత్తం అవుతుండడం తో మాజీల్లో గుబులు మొదలయింది.ఎమ్మెల్యే లున్న రోజుల్లో కవిత ఆధిపత్యం కు బ్రేక్ వేయడానికి అష్టకష్టాలు పడ్డారు.

కానీ ఇప్పుడు జస్ట్ మాజీ ఎమ్మెల్యే లుమాత్రమే కదా ఎమ్మెల్సీ గా ఉన్న కవిత ఆధిపత్యం ను నిలువరించడం దుసాధ్యంగా భావిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments