యాసిడ్ సేవించి వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన నగరంలోని మూడవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని నాందేవ్ వాడ కు చెందిన రూపేష్.గత కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ నెల 24 న జీవితం పై విరక్తి చెంది యాసిడ్ సేవించి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.
గమనించిన తల్లి హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.
