తెలంగాణ ఉర్దూ అకాడమీ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నాడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్న ఇద్దరి ని నిజామాబాద్ బార్ అసోసియేషన్ శనివారం ఘనంగా సన్మానించింది తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అబ్దుల్ కని, నిజామాబాద్ ఉర్దూ జర్నలిస్ట్ మహమ్మద్ అలీ ఖాన్ లు బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ ను మర్యాదపూర్వకము కలిశారు
ఈ సందర్భంగా వారిని బార్ అసోసియేషన్ అధ్యక్షులు పూలమాలలు వేసి శాలువాలతో సన్మానించారు ఈ సందర్భంగా భార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ ప్రొఫెసర్ అబ్దుల్ కవి ఉర్దూ పరిశోధన విమర్శ విభాగంలో నైపుణ్యం పొందిన సీనియర్ జర్నలిస్ట్ అహ్మద్ అలీ ఖాన్ మరియు ప్రొఫెసర్ అబ్దుల్ ఖవి యొక్క సేవలు ఎనలేనివని కొనియాడారు అందుకొరకే రాష్ట్ర ప్రభుత్వం వీరిని గుర్తించి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వారి వారి విభాగాల్లో ఇచ్చిందని ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు ఆర్థిక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి వసంత్ రావు ప్రభుత్వ న్యాయవాది వెంకటరమణ గౌడ్ న్యాయవాదులు పులి జైపాల్, యూనిస్ ఖాన్ సంతోష్.నాగ్ రవి బాబు శ్రీనివాస్, సురేష్, మంజిత్ సింగ్, అమీమ్ తదితరులు పాల్గొన్నారు.
