బీసీలకు 42శాతం రిజర్వేషన్లుకల్పించాలనే డిమాండ్ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యాన శనివారం రాష్ట్ర బంద్ కు పిలుపుతో జిల్లాలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది.
ఇందులో భాగంగా జిల్లాలో బంద్ విజయవంతం చేసేందుకు జిల్లాలోని బీసీ సంఘాల నాయకులు రెండు బృందాలుగా విడిపోయి విస్తృత ప్రచారం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 5 గంటలకే బీసీ సంఘాల నేతలు జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ కు చేరుకొని బస్సులు బయటకు రాకుండా చేశారు.అంతేకాక ప్రైవేట్ విద్యాసంస్థలను మూసి వేయించారు,అలాగే వ్యాపార సంస్థల,పెట్రోల్ బంకులు,సినిమా థియేటర్లు కూడా ముసి వేయించారు.
ఈ బీసీ బంద్ సందర్భంగా ప్రభుత్వ టీచర్లు పాఠశాలలకు డుమ్మా కొట్టారు. గత మూడు రోజులుగా జిల్లాలో నాయకులు విస్తృత ప్రచారం చేయడంతో పాటు ప్రధాన పార్టీల మద్దతు కూడగట్టారు.
బీసీ రిజర్వేషన్ల మద్దకుతుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, మాస్ లైన్, బీఎస్పీ, తెలంగాణ జన సమితితో పాటు అనుంబంధ సంఘాలు, యు వజన సంఘాల నాయకులు బంద్కు మద్దతు ప్రకటించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద బీసీ సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బంద్ ద్వారా రిజర్వేషన్ల ఆవశ్యకతను చాటిచెప్పడమే కాక అందరి మద్దతుతో సాధించుకోవడమే తమ లక్ష్యమని బీసీ సంఘాల నాయకులు చెబుతున్నారు.
