అధికార లాంఛనాల మధ్య కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియలు శనివారం నిర్వహించారు. ఐజీ చంద్రశేఖర్రెడ్డి, సీపీ సాయిచైతన్య అంత్యక్రియలకు హాజరై మృతుడు ప్రమోద్ భౌతికదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఐజీ చంద్రశేఖర్రెడ్డి, సీపీ సాయిచైతన్య లు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి మేమున్నామని వారికి ధైర్యం చెప్పారు. అడిషనల్ డీసీపీ బస్వారెడ్డితో పాటు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు, నగర సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సెలు, పోలీస్ సిబ్బంది హాజరయ్యారు.
