చెట్టుకు ఢీకొని భవాని దీక్ష స్వామి దుర్మరణం చెందిన ఘటన నసరుల్లాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..బాన్సువాడ మండలంలోని తడ్కోల్ గ్రామానికి చెందిన మణికంఠ(24).
భవాని దీక్ష మాల ధారణలో ఉన్నారు.ఆదివారం రాత్రి పనులు నిమిత్తం బయటకు వెళ్ళాడు. ఈ మేరకు నసరుల్లాబాద్ అటవీ ప్రాంతంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో స్థానికులు గమనించి 108లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యంలో మృతి చెందాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
