రాజంపేటలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. గుడి తండాకి చెందిన మాలోత్ అనిత, గణేశ్లో చిన్న కుమారుడు చిన్న శనివారం సాయంత్రం ఇంటి ముందర ఇతర పిల్లలతో కలసి ఆడుకుంటున్నాడు.
ఈ క్రమంలో అక్కడే ఉన్న ట్రాక్టర్ గేర్లను మార్చగా న్యూట్రల్లోకి వెళ్లింది. వెనకకు పల్లం ఉండటంతో ట్రాక్టర్ టైర్ చిన్న పైనుంచి వెళ్లింది.గాయపడిన చిన్నాను కామారెడ్డి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
