నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గోల్ హనుమాన్ మరియు రొకడి హనుమాన్ ఆలయాల్లో మాజీ శాసనసభ్యులు ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శోభయాత్ర లో సందడి చేసారు.
జెడ్పి కార్యాలయం వద్ద మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు,పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు బాజిరెడ్డి మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు హనుమాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. జిల్లా ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానన్నారు .
ఈ కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్ గారు,సిర్ప రాజు,ప్రభాకర్ రెడ్డి ,సుజిత్ సింగ్, సత్యప్రకాశ్ మరియు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.