యువజన కాంగ్రెస్ నిజామాబాద్ లోకసభ నియోజకవర్గ రామర్తి గోపీ నియామకం అయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న గోపీ ఈ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ క్యాడర్ మరింత క్రియాశీలకంగా పనిచేయాలనే ఆలోచనతో గోపి కి బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివ సేన రెడ్డి మరియు జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి, రాష్ట్ర బాద్యులు సురభి ద్వివేది నాపై నమ్మకంతో నిజామాబాదు పార్లమెంట్ బాధ్యతలుగా నన్ను నియమించినందుకు గోపి ధన్యవాదాలు తెలిపారు
నిజామాబాదు పార్లిమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి గెలుపులో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం బాధ్యత ఉంది కావున ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్తలు కష్ట పడి నిజామాబాదు గడ్డ మీద కాంగ్రెస్ జండా ఎగర వేస్తామన్నారు