లోకసభ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో యం ఐ యం లో ధిక్కార స్వరం వినిపిస్తుంది.కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. నిజామాబాద్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి తో భేటీ అయ్యారని ప్రచారం జరుగుతుంది. సోమవారం రాత్రి బోధన్ రోడ్ లో ఉండే ప్రముఖ రియల్ ఎస్టేట్ కార్యాలయం లో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత రహీమ్ సోఫీ మధ్యవర్తిగా వ్యవహరించారని సమాచారం.
యం ఐ యం కు చెందిన ఆరుగురు కార్పొరేటర్లు ఈ భేటీ లో ఉన్నట్లు సమాచారం. అయితే జీవన్ రెడ్డి తో వీరు ఏ విషయాలు మాట్లాడారు ఎలాంటి ఒప్పందాలు జరిగాయనేది బయటికి పొక్కడం లేదు. ఈసారి లోకసభ ఎన్నికలో ఆ పార్టీ ఏ పార్టీకి మద్దతూ ఇవ్వాలనేది దారుస్సలాం నుంచి ఎలాంటి ఆదేశాలు ఇంకా రాలేదు. ఆ పార్టీ ఇప్పటికి బిఆర్ యస్ కు మిత్ర పక్షంగానే ఉంది.
ఇంకా ఎలాంటి తెగతెంపులు జరగలేదు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ యస్ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తో లోపాయికారి గానే అవగాహన కుదిరింది. కానీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో ఆ పార్టీ ఎటూ తేల్చుకోలేక పోతుంది. కానీ నిజామాబాద్ నగర లో యం ఐ యం కు చెందిన కొందరు కార్పొరేటర్లు మాత్రం ఓ అడుగు ముందుకేసి కాంగ్రెస్ తో మద్దతు ఇవ్వడానికి తహతహ లాడుతున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొందరు కార్పొరేటర్లు దారుస్సలాం ఆదేశాలను ధిక్కరించి కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ కిమద్దతు ఇచ్చారు. బిఆర్ యస్ నేతల తో చెట్టపట్టాలేసుకొని తిరుగుతూనే పోలింగ్ కొద్దీ రోజుల ముందు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఓ దశలో ఎనిమిది మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధం అయ్యారు. కానీ షబ్బీర్ అలీ నుంచే సానుకూలత రాలేదు.తమ ఆదేశాలు ఎవరెవరు దిక్కరించారనేది అధినేత హాసద్ ఇదివరకే అరా తీశారు.
ఎంపీ ఎన్నికల్లోనూ అదే సిన్ రిపీట్ అవుతుంది. అధినేత ఆదేశాలు రాకముందే కార్పొరేటర్లు కాంగ్రెస్ తో దోస్తీ కి సిద్ధం కావడం ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది