కాళేశ్వర్ వ్యవహారంలో కెసిఆర్ మీద సీబీఐ విచారణ కోరడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ తలపెట్టిన ఆందోళన లు తుస్సుమన్నాయి.
కాళేశ్వరం కమిషన్ నివేదిక ను నిరసిస్తూ బిఆర్ యస్ తలపెట్టిన రెండు రోజుల ఆందోళన లు మంగళవారం మొదలయ్యాయి.
ఉమ్మడి జిల్లాలో ఈ ఆందోళనలు మొక్కుబడిగా జరిగాయి. నియోజకవర్గాల ఇంచార్జ్ లుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఈసారి కూడా మొఖం చాటేశారు. తమ అనుచరులను పురమాయించి చేతులు దులుపుకున్నారు.
వారుకూడా ఆయా చౌ రాస్తా లలో కి వచ్చి అర గంట హడావుడి చేసి చేతులు దులుపేసుకొని వెళ్లారు. మొత్తానికి ఈ నిరసనల మొక్కుబడి తంతూ గా కానిచ్చేశారు. జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తో పాటు ఏకైక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సైతం ఈ ఆందోళన ల వీఐపీ కన్నెత్తి చూడక పోవడం గమనార్హం.
పార్టీ అధినేత కెసిఆర్.విషయంలో నేతలు తమకేమి పట్టనట్లుగా వ్యవహరించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. పార్టీ అధికారంలో వుండగా పదేళ్లు పెత్తనం సాగించిన ఎమ్మెల్యే లు అధికారం కోల్పోయాక నియోజకవర్గాల వైపు కన్నెత్తి కూడా చూడ్డడం లేదు.
కాళేశ్వర్ కమిషన్ ఫై సీబీఐ విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశించింది. కెసిఆర్ మీద సిబిఐ విచారణ ను నిరసిస్తూ బిఆర్ యస్ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది.
నిజామాబాద్ జిల్లా లో ఆయా ,నియోజకవర్గ కేంద్రాలలో నిరసనలు చేయాలని పేర్కొంది. నియోజకవర్గ ఇంచార్జ్ లు పార్టీ శ్రేణులు మండల పార్టీ అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు కలిసి ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలతో నిరసనలు తెలియజేయాలని పేర్కొంది.
అధినేత కెసిఆర్ వ్యవహారం కావడంతో పార్టీ క్యాడర్ పెద్ద సంఖ్యలో రోడ్డెక్కే అవకాశం ఉంటుందని భావించిన పోలీస్ శాఖ అప్రమత్తం అయింది.
ఆందోళన జరిగే ప్రాంతాల్లో భద్రతా కట్టుదిట్టం చేసింది. కానీ మొదటి రోజు ఆందోళనలు తుస్సు మన్నాయి.మాజీ ఎమ్మెల్యేలు ఈ నిరసనలు దూరంగా ఉండి పోయారు.
తమ అనుయాయులను పురమాయించి హైదారాబాద్ కు పరిమితం అయ్యారు.మాజీ ఎమ్మెల్యే లు లేక పోవడంతో ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నిరసనలు మొక్కుబడిగా జరిగాయి.
