జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఫై సిబిఐ విచారణఫై హైకోర్టు బ్రేక్ వేసింది. సిబిఐ విచారణ కోరుతూ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడాన్ని సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు హైకోర్టు ను ఆశ్రయించారు
వారి పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపట్టవద్దని హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది
వెకేషన్ తర్వాత తదుపరి వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది
