Tuesday, April 28, 2026
HomeCRIMEకంజర లో దారుణ హత్య ...కొడుకు ను హత్య చేయడానికి వెళ్ళి తండ్రి ని మట్టుబెట్టారు...

కంజర లో దారుణ హత్య …కొడుకు ను హత్య చేయడానికి వెళ్ళి తండ్రి ని మట్టుబెట్టారు ….కళ్ళలో కారం పోసి ….కత్తులతో పొడిచి ….పాత కక్ష లు…..నిందితుల్లో మాజీ సర్పంచ్…

కొడుకు ను హత్య చేయడానికి వెళ్లి అతను పోవడంతో తండ్రి ని హత్య చేసిన ఘటన మోపాల్ మండలం కంజర గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. మృతుడి కళ్ళలో కారం పొడి చల్లి ఆపై కత్తులతో పొడిచి హత్య చేశారు.

పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగింది. గ్రామానికి చెందిన సత్యనారాయణ తన కూతురు భవిత ను అదే గ్రామానికి చెందిన గోవర్ధన్ తో వివాహం చేశారు.

కానీ భవిత ఆత్మ హత్య కు పాల్పడింది. భర్త గోవర్ధన్ వేధింపుల వల్లే కూతురు చనిపోయిందని కక్ష పెంచుకున్న సత్యనారాయణ ఎలాగైనా అల్లుడు గోవర్ధన్ ను హత్య చేయాలనీ ప్లాన్ చేసాడు.

బుధవారం రాత్రి అదే గ్రామానికి చెందిన నలుగురు తో కలిసి గోవర్ధన్ ఇంటికి వెళ్ళాడు. కానీ అయన లేకపోవడంతో అతని తండ్రి నరహరి వెంటాడి కళ్ళలో కారం పొడి చల్లి ఆపై కత్తులతో విచక్షణ రహితంగా హత్య చేసి పారిపోయారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!