HomeCRIMEనిజాం సాగర్ కెనాల్ లో ప్రమాదవశాత్తు పడి మహిళ మృతి..

నిజాం సాగర్ కెనాల్ లో ప్రమాదవశాత్తు పడి మహిళ మృతి..

నిజాం సాగర్ కెనాల్ లో పడి మహిళ మృతి చెందిన ఘటన రూరల్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తపేట మల్కాపూర్ కు చెందిన పెద్దోళ్ల లక్ష్మి (49).

భర్త పెద్దోళ్ల లింగం. కులవృత్తి నిమిత్తం కాలువలో బట్టలు ఉతకడానికి వెళ్లారు. భర్త లింగం ఒడ్డుకు వచ్చి బట్టలు అరబెడుతున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో నిజాంసాగర్ కెనాల్ నీటి ఉదృతగా పెరగడంతో ప్రమాదవశాత్తు మహిళ గల్లంతు కావడం అక్కడే ఉన్న భర్త సమాచారంతో గ్రామస్తులు చేరుకొని గాలించగా కెనాల్ బ్రిడ్జి స్తంభాలకు చిక్కి మృతదేహం లభ్యమైంది.

స్థానికుల సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎండి ఆరిఫ్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments