నిజామాబాద్ పోలీస్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎర్రపాటి శ్రీను నియమితులయ్యారు. పోలీసు సిబ్బంది సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా శ్రీను తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన యూనియన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
పోలీసు సిబ్బందికి సంబంధించిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సిబ్బంది సంక్షేమం కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు సిబ్బంది, యూనియన్ సభ్యులు ఎర్రపాటి శ్రీనుకు అభినందనలు తెలిపారు.
