యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి మహిళ ప్రాణాలు కోల్పోయింది. చౌటుప్పల్ మండలం పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం (జూన్ 06) వేగంగా దూసుకువచ్చిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు, ముందు వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది.
ఈ భీకర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
బాధితులు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్నారు. కారు చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా సమీపానికి చేరుకోగానే, వెనుక నుంచి సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు అతివేగంగా వచ్చి కారును బలంగా ఢీకొట్టింది.
