Monday, May 4, 2026
HomeTelanganaNizamabadప్రైవేటు విత్తనాల పట్ల జాగ్రత్త వహించాలి... రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అవినాష్ రెడ్డి...

ప్రైవేటు విత్తనాల పట్ల జాగ్రత్త వహించాలి… రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అవినాష్ రెడ్డి…

రైతులు ప్రైవేట్ విత్తనాల పట్ల జాగ్రత్త వహించాలని రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు..

ప్రైవేట్ విత్తన కంపెనీలు ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తూ రైతులను మోసం చేయొద్దని హెచ్చరించారు. ఈ మధ్యలో ప్రైవేట్ విత్తనాల కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నయని వారి ఉబిలో పడి రైతులు మోసపోవద్దని పేర్కొన్నారు.

అలాగే గతం లో ఉన్న నిజామాబాద్ బ్రాండ్ అయిన సారంగాపూర్ సీడ్స్ బేవర్సికేషన్ సమయంలో కనుమరుగైన సీడ్స్ ను మళ్లీ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ కంపెనీల ప్రలోభాలకు గురై రైతులు నష్టపోవద్దని ఆయన పేర్కొన్నారు.

అలాగే ప్రభుత్వం సరఫరా చేసే సీడ్స్ ను సబ్సిడీ రూపంలో తీసుకోవాలని రైతులను సూచించారు.విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోని యెడల పంటల సాగులో విత్తనం మొలకెత్తకపోవడం, ఎక్కువగా తెగుళ్ళు, చీడపీడలు ఆశించడం వల్ల పంటనష్టం జరుగుతుంది.

తద్వారా రైతు సోదరులు విత్తన ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రైతు సహకార సంఘాల ద్వారా రైతులకు విత్తనాలు అందిస్తామని అన్నారు.అలాగే కొనుగోలు విషయంలో ఆలస్యమైన తప్పకుండా ప్రభుత్యం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ వ్యవసాయ శాఖ సహకార శాఖ మరియు అగ్రోస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!