వృద్ధురాలి మెడలో నుంచి గొలుసు ఎత్తుకెళ్లిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. మూడో టౌన్ పరిధిలో శనివారం ఉదయం జరిగింది. ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.
నగరంలోని గౌతమ్ నగర్ కు చెందిన అనసూయ అనే వృద్ధురాలు శనివారం తెల్లవారుజామున ఇంటి పనులు చేస్తుండగా ఓ గుర్తు తెలియని దుండగుడు నడుచుకుంటూ వచ్చి వృద్ధురాలి మెడలో నుంచి రెండున్నర తులాల గొలుసు లాక్కుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
