HomeCRIMEరోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం...

రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం…

రోడ్డు ప్రమాదంలో దంపతులిద్దరూ మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై వినయ్ కథనం ప్రకారం..

నవీపేట మండలం ఫకీరాబాద్ కు చెందిన మగ్గిడి లక్ష్మణ్ (55), భార్య రాజమణి (50)తో కలిసి అబ్బాపూర్ (ఎం)లో ఉంటున్న కూతురు వద్దకు శుక్రవారం వెళ్లారు. తిరిగి రాత్రి స్వగ్రామానికి బయల్దేరారు.

ఈ క్రమంలో నవీపేట శివారులోని మిషన్ భగీరథ మూల మలుపు వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన లారీ లక్ష్మణ్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

కాగా లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments