నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల శ్రద్ధానంద్ గంజ్ లోని కూరగాయల మార్కెట్ ను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్లో కార్మికులు, రైతులు వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు మౌలిక వసతులైన బాతురూముల గురించి , అడిగి తెలుసుకున్నారు. అలాగే హమాలీ కార్మికులకు విశ్రాంతి భవన ఏర్పాటు గురించి మాట్లాడారు.
బయట నుండి ప్రైవేట్ వెహికల్స్ రావడం వల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉండాలని సూచించారు. అలాగే హమాలి కార్మికులకు కార్డుల గురించి, దోమల నియంత్రణకై చర్యల గురించి, హమాలీ కార్మికులకు డ్రస్సు ఇవ్వాలని కోరారు.
లలిత మహల్ టాకీస్ నుండి అర్సపెల్లి వేపుగా నిజాం కాలనీ వరకు మెయిన్ రోడ్ పై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఒక విజ్ఞాపన పత్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కి కూరగాయల హమాలీ వర్కర్స్ యూనియన్, నైట్ వాచ్మెన్ వర్కర్స్ యూనియన్ మరియు ముల్లె హమాలీ సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఇవ్వడం జరిగింది.
విజ్ఞాపన పత్రాన్ని తీసుకుంటూ అందులో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కూరగాయల హమాలి వర్కర్స్ యూనియన్, నైట్ వాచ్మెన్ వర్కర్స్ యూనియన్, ముల్లె కార్మిక సంఘం ల తరఫున నాయకులు ఎం , ఎం మోహన్, ఎం రాజు, పీరయ్య, మల్లేష్, గంగాధర్. వకీల్ అన్వర్ రమేష్ సాయిలు ఇర్ఫాన్ కిషోర్ ఫెరోజ్ పవన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
