బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కూతురు పెండ్లి దుబాయ్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి నిజామాబాద్ జిల్లాకు చెందిన బిఆర్ యస్ అగ్ర నేతలు దుబాయ్ క్యూ కట్టారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ తో పాటు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ లు కూడా ఈ వేడుక లో పాల్గొన్నారు.
మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తో పాటు జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ,రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే లు బాజిరెడ్డి గోవర్ధన్ బిగాల గణేష్ ,ఏనుగు రవీందర్ రెడ్డి లున్నారు.
గ్రాండ్ హయత్ హోటల్ లో వీరందరికి బస ఏర్పాటు చేశారు. పెండ్లి ఫామ్ జమేరా లోని అట్లాస్ హోటల్ అత్యంత వైభవంగా జరిపారు.
